తెలంగాణ

పాతాళంలో భూగర్భ జలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: భగభగమండే ఎండలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలు మరింత లోతుకు వెళ్లాయి. రాష్ట్రం మొత్తం మీద మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో భూగర్భ జల నీటి మట్టం 54.10 మీటర్ల దిగువకు జారిపోగా, ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో 4.60 మీటర్లలోతుకు చేరింది. ఈ వివరాలను తెలంగాణరాష్ట్ర భూగర్భ జల శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 137 మండలాల్లో 20 మీటర్ల లోతుకు, 167 మండలాల్లో 10 నుంచి 20 మీటర్ల లోతుకు, 100 మండలాల్లో 5 మీటర్ల నుంచి 10 మీటర్ల లోతుకు, ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల 21 బోర్ వెల్స్‌లో నీటి మట్టాలు 2 నుంచి 5 మీటర్ల లోతుకు పడిపోయినట్లు సర్వేలో వెల్లడైంది. జిల్లాల వారీగా విశే్లషిస్తే మెదక్ జిల్లాలో 36 మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 27 మండలాలు, నల్లగొండ జిల్లాలో 18 మండలాలు, నిజామాబాద్ జిల్లాలో 16 మండలాలు, రంగారెడ్డి జిల్లాలో 13 మండలాల్లో 20 మీటర్ల లోతుకు భూగర్భ జల మట్టాలు పడిపోయాయి.
కరీంనగర్ జిల్లాలో 31 మండలాల్లో, నల్లగొండ జిల్లాలో 24 మండలాలు, వరంగల్ జిల్లాలో 24 మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 22 మండలాలు, రంగారెడ్డి జిల్లాలో 14 మండలాలు, నిజామాబాద్ జిల్లాలో 13 మండలాల్లో 10 నుంచి 20 మీటర్ల లోతుకు భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 22 మండలాల్లో, వరంగల్ జిల్లాలో 15 మండలాల్లో, కరీంనగర్ జిల్లాలో 15 మండలాలు, ఖమ్మం జిల్లాలో 14 మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 10 మండలాల్లో భూగర్భ జల నీటి మట్టాలు 5 నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఆదిలామాద్ జిల్లాలో 21 బోర్‌వెల్స్‌లో 2 నుంచి 5 మీటర్ల లోతుకు నీటి మట్టాలు పడిపోయాయి. రాష్ట్రంలో 25 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. దీని వల్ల రాష్ట్రంలో గత ఏడాది సగటు భూగర్భ జల మట్టం 12.77 మీటర్లు ఉండగా, ఈ ఏడాది 15.66 మీటర్లకు పడిపోయింది.
రాష్ట్రం మొత్తం మీద మహబూబ్‌నగర్ జిల్లాలో బిజ్నేపల్లి మండలంలో 33.73 మీటర్లు, దారూర్‌లో 37.67 మీటర్లు, కల్వకుర్తిలో 36.19 మీటర్లు, లింగాలలో 35.96 మీటర్లు, షాద్‌నగర్‌లో 42.06 మీటర్లు, రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్‌లో 30.56 మీటర్లు, మొయినాబాద్‌లో 43.51 మీటర్లు, మెదక్ జిల్లా హత్నూర్‌లో 36.40 మీటర్లు, గజ్వేల్‌లో 35.08 మీటర్లు, దుబ్బాకలో 41.81 మీటర్లు, రాయికోడ్‌లో 44.35 మీటర్లు, టేక్మల్‌లో 37.24 మీటర్లు, ఆదిలాబాద్ జిల్లాలో నీరడిగొండలో 39.50 మీటర్లు, వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో 45.83 మీటర్లు, నల్లగొండ జిల్లాలో భువనగిరిలో 38.50 మీటర్లు, చిట్యాలలో 36.09 మీటర్లు దిగువకు భూగర్భ జల మట్టాలు పడిపోయాయి.