తెలంగాణ

మండలికి తాకిన అసెంబ్లీ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటుచేసుకున్న సెగ మంగళవారం ప్రారంభం అయిన మండలికి పాకింది. సభ ప్రారంభం అయిన పది నిమిషాల్లోపే ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు సభ్యులను సస్పెండ్ చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. దీంతో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు షబ్బీర్ అలి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దామోదర్ రెడ్డి, సంతోష్‌లను సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో పొంగులేటి అసెంబ్లీలో జరిగిన సంఘటనకు తమకు బాధ్యులను ఎలా చేస్తారని, సస్పెండ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.
సస్పెండ్‌కు గురి అయిన సభ్యుల ప్రశ్నలకు సమాదానం చెప్పాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్ సభ్యులు ఎదురు ప్రశ్నించడంతో ఇరు పార్టీల సభ్యుల మద్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో డిప్యూటీ చైర్మన్ మార్షల్స్‌ను పిలవాల్సి ఉంటుందని చెప్పడంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సభ నుంచి వెలుపలకు వెళ్లిపోయారు.