తెలంగాణ

హైకోర్టు విభజనకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: హైకోర్టు విభజనకు కేంద్రంపై వత్తిడి తీసుకువస్తామని న్యాయశాఖా మంత్రి ఎ ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శ్రీనివాస్‌గౌడ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంగళవారం నాడు మంత్రి శాసనసభలో సమాధానం చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి న్యాయస్థానాన్ని వెంటనే విభజించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తూ, రాష్ట్ర శాసనమండలి ఉభయ సభలు 2015 మార్చి 18న తీర్మానం చేసి న్యాయశాఖా మంత్రికి, ఆ విభాగానికి కూడా పంపించామని అన్నారు. అపుడు తెలంగాణ, ఆంధ్రా హైకోర్టులు హైదరాబాద్‌లోనే విడివిడిగా ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని చెప్పారని ఈ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సైతం లేఖ రాశామని వివరించారు. పార్లమెంటు సభ్యులు న్యాయవాదుల సంయుక్త కార్యాచరణ కమిటీ కేంద్ర న్యాయమంత్రికి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించిందని, సిఎం కూడా ఈ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు.