తెలంగాణ

జర్నలిస్టులకు ఇళ్లస్థలాల ప్రస్తావనే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: జర్నలిస్తులక్ఘ్ఘు ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వరంగల్ వెళ్లినపుడు చెప్పారని కాని నాలుగేళ్లయినా ఆ ఊసే లేదని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. మంగళవారం నాడు శాసనసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆరు నెలల్లో గృహప్రవేశాలు చేస్తారని, అందరం కలిసి భోజనం చేద్దామని సిఎం పేర్కొన్నారని ఇపుడు ఆ అంశం గురించి సిఎం మాట్లాడటం లేదని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్లో వివక్ష ఉందని అందరికీ ఒకే రకమైన వేతనాలు చెల్లించాలని అన్నారు. ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఉప్పల్ బస్ టెర్మినల్‌ను పట్టించుకోవాలని కోరారు. యాదగిరిరెడ్డి మాట్లాడుతూ 24 గంటల విద్యుత్ పంపిణీ వల్ల దిగువ పొలాల్లొ నీరు స్టాక్ ఉండిపోంతోందని అన్నారు. ఖాద్రీ పాషా మాట్లాడుతూ బోడుప్పల్ మసీదు అభివృద్ధి చర్యలు చేపట్టాలని అన్నారు. దుర్గం చెన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లిలో బస్‌డిపో ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించాలని, పంటలపై రైతాంగానికి స్పృహ కలిగించాలని చెప్పారు.
సున్నంరాజయ్య మాట్లాడుతూ చల్లవాగు చెక్‌డాం, కొత్త వాగు చెరువు బండ్‌ను పటిష్టం చేయాలని సూచించారు. కౌసర్ మొహియుద్దీన్ మాట్లాడుతూ ఆర్మీ మాజీ అధికారులు నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్దీకరణకు ప్రభు త్వం తోడ్పాటు అందించాలని అన్నారు. చింత ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటిని అడ్డుకోవాలని అన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐ పాలసీని తీసుకురావాలని పేర్కొన్నారు.