తెలంగాణ

రేపటి నుంచి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలను ప్రశాంతగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్టు పాఠశాల విద్య కమిషనర్ జి కిషన్, పరీక్షల డైరెక్టర్ బి సుధాకర్ తెలిపారు. వారు మంగళవారం నాడు పాత్రికేయులతో మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్ధులకు సైతం వారు పలు సూచనలు చేశారు. అభ్యర్ధులతో పాటు పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం వారు సూచనలు చేశారు.
ఈ ఏడాది 11103 పాఠశాలల నుండి 5,38,867 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరవుతున్నారని వారిలో 2,62,479 మంది బాలికలు ఉన్నారని అన్నారు. 35,750 మంది ప్రైవేటు అభ్యర్ధులు, 20,838 మంది ఒకేషనల్ అభ్యర్ధులున్నారని వారు చెప్పారు. హాల్‌టిక్కెట్లను పరీక్షల బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, వాటిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రధానోపాధ్యాయుడి సంతకం , స్టాంపుతో హాజరుకావచ్చని అన్నారు. 2542 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, వాటికి ఇప్పటికే మెయిన్,అడిషనల్, గ్రాఫ్ షీట్లను పంపించామని చెప్పారు. డిజిఓ కార్యాలయం నుండి నాలుగు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, రాష్టవ్య్రాప్తంగా 148 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.
పరీక్షల సమయంలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్ధుల విషయంలో జీవో 872, తెలంగాణ పబ్లిక్ పరీక్షల చట్టం, యాక్టు 25/1997లో నిర్దేశం ప్రకారం తీసుకోగల చర్యల గురించి కూడా వారు వివరించారు. విద్యుత్ ఆటంకం లేకుండా చర్యలు చేపట్టామని, అలాగే రవాణా సౌకర్యం పెంచమని ఆర్టీసీని కోరామని అన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఎఎన్‌ఎంను అవుసరమైన మందులతో నియమించాలని కోరామని అన్నారు. పరీక్షల అనంతరం ఆన్సర్ పేపర్లను సంబంధిత మూల్యాంకన కేంద్రాలకు తగిన జాగ్రత్తలతో పంపించే విషయంలో పోస్టల్ శాఖకు కూడా సూచనలు చేశామని అన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టు పక్కల ప్రాంతాల్లో సిఆర్‌పిసి 144 సెక్షన్ అమలుచేస్తామని, కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయమని చెప్పామని అన్నారు. 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ (040-23230942) ఏర్పాటు చేశామని వెల్లడించారు.
అభ్యర్ధులకు సూచనలు:
పరీక్ష కేంద్రాలను ముందు రోజే చూసుకోవాలని, అలాగే పరీక్ష కేంద్రాలకు ఉదయం 8.45 గంటలకే చేరుకోవాలని వారు చెప్పారు.