తెలంగాణ

ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుంటే రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయని ఎమ్మెల్సీ రామచందర్ రావు ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు ఏమి లేవని, పాత విషయాలనే తిరిగి చదివించారని అన్నారు. రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ బాగా పెరిగిందని ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, అభివృద్ధి కంటే వేగంగా రుణాలు పెరుగుతున్నాయని అన్నారు. ఒక్కో వ్యక్తిపై ఏ మేరకు రుణభారం ఉందో వివరించలేదన్నారు. వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురి అవుతుందని, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాలిహౌస్‌ల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉండగా, ఆ ప్రయత్నం జరగడం లేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి అందుతున్న సహాయంపై నోరు మెదపడం లేదని, స్వయంగా రాష్టమ్రే పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధిస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం విచారకరమని అన్నారు. భూ రికార్డుల డిజిటలైజేషన్‌ను తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ సర్వే ద్వారా ఎక్కడైనా ప్రభుత్వ భూములను గుర్తించారా? వివాదంలో ఉన్న స్థల వివరాలను ఎందుకు భయపటపెట్టడం లేదని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్దమైన నిరసనలకు అవకాశం ఇవ్వకుండా అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలే చేపట్టకపోవడంతో విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని అన్నారు. వీటన్నింటిని కప్పిపుచ్చి గవర్నర్‌తో అనుకూల ప్రసంగం చేయించారని అన్నారు.