తెలంగాణ

‘అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తున్నాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధిస్తోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు పళ్ల రాజేశ్వర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, ప్రభాకార్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో వారు ప్రసంగించారు. వ్యవసాయం నుంచి ఐటి వరకు అన్ని రంగాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా అభివృద్ధి జరిగేలా చూస్తుందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇక్కడి రైతులు వ్యవసాయం చేసేందుకు భయపడేవారని, అలాంటి వారికి నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో వ్యవసాయ రంగం అద్భుత పురోగతి సాధించిందని అన్నారు. రైతులు పండించిన పంటను భద్ర పరుచుకునేందుకు గోదాములను ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర అందిస్తుందని చెప్పారు. అనేక అంశాల్లో కేంద్రం సహకరించక పోయినా రాష్టమ్రే భరిస్తోందని తెలిపారు. కలుషిత నీటి ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని గమనించిన ముఖ్యమంత్రి మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామీణ ప్రజలందరికీ శుద్ధమైన జలాలను అందిస్తున్నారని అన్నారు.