తెలంగాణ

ఉడ్ ప్లాంటేషన్ రైతులకు గిట్టుబాటు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: కాగితపు ఉడ్ ప్లాంటేషన్‌ను సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటుధరలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఐటిసి పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్ ఐటి డివిజన్ సివోవో వాడిరాజ్ కులకర్ణి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంపెనీ మిల్లుకు తమ పంట ఉత్పత్తులను సరఫఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోనుగోలు ఆర్డర్‌ను రైతులకు నేరుగా విడుదల చేస్తామన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామన్నారు.
సరఫరాదారులకు రైతులు తమ ఉత్పత్తిని విక్రయించే టప్పుడు టన్నుల ప్రాతిపదికన నిర్ణయించాలని ఆయన కోరారు. రైతులకు సరసమైన ధరలు అందేలా, వారి ఖాతాల్లోకి సక్రమంగా నగదు జమ అయ్యేలా తమ సంస్థ పర్యవేక్షిస్తుందన్నారు. మూడున్నర సంవత్సరాలకు పైగా వయసు కలిగిన కలప ఉన్న రైతులకు మాత్రమే ఐటిసి ప్రయోజనం కలిగిస్తుందన్నారు.
16న స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ కానున్న కార్దా కన్‌స్ట్రక్షన్
నాసిక్ ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న కార్దా కన్‌స్ట్రక్షన్ కంపెనీ తొలిసారిగా ఈ నెల 16వ తేదీన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు వెళ్లనుంది. 43లక్షల ఈక్విటీ వాటాలను ప్రైస్ బ్యాండ్ రూ.175 నుంచి రూ.180 ధరలతో జారీ చేస్తామని ఆ సంస్థ ఎండి నరేష్ కర్దా తెలిపారు. మొత్తం ఇష్యూ పరిణామం రూ. 77. 40 కోట్లు ఉంటుందన్నారు. తమ సంస్థకు మార్కెట్‌లో మంచి పేరు ఉందని మెగా బిల్డర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించిందన్నారు.