తెలంగాణ

2.40 లక్షల మందికి గొర్రెల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: రాష్ట్రంలో పేద గొల్ల, కురుమ కులాల వారిని ఆదుకునేందుకు పెద్ద ఎత్తున గొర్రెలు, పొట్టేలు సరఫరా చేశామని పాడిపరిశ్రమాభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మంగళవారం నాడు శాసనసభలో తెలిపారు. దుర్గం చెన్నయ్య, వెంకటేశ్వరరెడ్డి, అంజయ్య తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ లబ్దిదారుడికి ఒకొక్కరికీ 20 గొర్రెలు, ఒక పోట్టేలు కలిపి 93వేల రూపాయిలు విలువైనవి సరఫరా చేశామని తెలిపారు. 2 లక్షల 40వేల 193 మంది లబ్దిదారులకు మొత్తం 50 లక్షల 44వేల గొర్రెలను ఇచ్చామని ఆ గొర్రెలు తిరిగి 16 లక్షల పిల్లలను పెట్టాయని అన్నారు. ఈ పథకం అమలులో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని, అయితే సరఫరా చేసిన గొర్రెలను అధికారులు తిరిగి ఇతర లబ్దిదారులకు పంపిణీచేస్తూన్న ఘటనలు కూడా ఎక్కడా జరగలేదని అన్నారు. అయితే చిన్నచిన్న లోపాలకు సంబంధించి ఆరు కేసులను నమోదుచేశామని ఆయన వివరించారు.