తెలంగాణ

కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో పెరగనున్న పట్టణ జనాభా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: పట్టణాల పురోగతికి తెలంగాణ నగర ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా మరిన్ని నిధులు ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషననర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. పట్టణాల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల కొరకు నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఇప్పటికే పట్టణాలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రత్యేక నిధులు ఇస్తుందన్నారు. తెలంగాణలో సుమారు 39 శాతం జనాభా పట్టణ ప్రాంతంలో ఉందని, త్వరలో ఏర్పాటు చేయనున్న కొత్త పురపాలక సంఘాలతో ఈ శాతం 45కు పెరుగుతుందన్నారు. పట్టణాలను పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాలకు ప్రణాళిక బద్ధంగా పక్కా రోడ్డు మ్యాపుతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్లకు తెలిపారు. పట్టణాలకు సంస్థ ద్వారా ఇస్తున్న నిధులను నిర్ణీత గడువుపూర్తయ్యేలోగా పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పట్టణంలో చేపట్టాల్సిన పనుల విషయంలో సిద్ధిపేట పట్టణాన్ని ఒక రోల్ మోడల్‌గా తీసుకోవాలన్నారు. పట్టణంలోని జంక్షన్ టూ జంక్షన్ రోడ్ల అభివృద్ధి, మోడల్ మార్కెట్లు, ఫుట్ పాత్‌లు, బస్‌బేలు,మురికి కాల్వల అభివృద్ధి, శ్మశాన వాటికలు, పార్కుల అభివృద్ధి మొదలైన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్లు ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
జిల్లా స్థాయిలో కలెక్టర్లు పట్టణాల అభివృద్ధి పనుల బాధ్యతను తీసుకుంటే అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి పట్టణానికి ఒక ఫేస్ లిఫ్ట్ ఉండే విధంగా అధికారులు ప్రారంభమయ్యాయన్నారు. ప్రతివారం ఈ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, టియూఎఫ్‌ఐడి చైర్మన్ విప్లవ్ కుమార్, ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న మంత్రి కేటీ రామారావు