తెలంగాణ

రైతు సంక్షేమానికి రూ.12వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మార్చి 13: రాష్ట్రంలోని 75లక్షల మంది రైతులకు నేరుగా రెండు పంటలకు 8వేల రూపాయలు రైతులక్ష్మి పథకం ద్వారా ఈ ఏడాది అందించేందుకు బడ్జెట్‌లో 12వేల కోట్ల కేటాయింపులను చేయనున్నారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. సమితి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్నారు. అర్చక పండితులు ఆయనకు ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందించారు. అనంతరం గుత్తా విలేఖరులతో మాట్లాడుతూ రైతు సమన్వయ సమితిల ద్వారా అమలు చేయబోయే పథకాలను వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఈ ఏడాది 5వేల వరినాట్లు వేసే యంత్రాల పంపిణీ, హార్వేస్టర్‌ల పంపిణీ చేపట్టనున్నామన్నారు. 2656రైతు క్లస్టర్‌లను ఏర్పాటు చేసిన వాటికి రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతు వేదికలకు ఒక్కోదానికి రూ.12లక్షలు కేటాయించనున్నామన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులు, అధికారులు కూర్చుని తమ ప్రాంత రైతులకు ఏ రకమైన ప్రయోజనాలు అందించాలో చర్చించి నిర్ణయించుకుంటారన్నారు. క్లస్టర్‌కు భూ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసి సర్వే నెంబర్ వారిగా పంట సాగు వివరాల కార్డులను అందిస్తామన్నారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో దేశంలోనే తొలిసారిగా రైతు లక్ష్మి పథకం, రైతు బీమా పథకాలు అమలు జరుగుతుండటం గర్వకారణమన్నారు. రైతు సమన్వయ సమితులు, కెసిఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమపథకాలు విజయవంతం కావాలని స్వామివారిని దర్శించి కోరుకున్నామన్నారు. రైతు సమన్వయ సమితుల చైర్మన్‌గా కెసిఆర్ నాకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తానన్నారు. ఆయన వెంట మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎంపిపి పాశం రాంరెడ్డి తదితరులు ఉన్నారు.

చిత్రం..యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో పురోహితుల ఆశీర్వచనం అందుకుంటున్న గుత్తా దంపతులు