తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం కాగితం గుజ్జు ప్లాంటేషన్ రైతులకు గిట్టుబాటు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: కాగితపువుడ్ ప్లాంటేషన్‌ను సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటుధరలు లభించేలా చూస్తామని ఐటిసి పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్ ఐటి డివిజన్ సివోవో వాడిరాజ్ కులకర్ణి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంపెనీ మిల్లుకు రైతులు తమ పంట ఉత్పత్తులను సరఫఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోనుగోలు ఆర్డర్‌ను రైతులకు నేరుగా విడుదల చేస్తామన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. రైతులు తమ ఉత్పత్తిని విక్రయించే టప్పుడు టన్నుల ప్రాతిపదికన నిర్ణయించాలని ఆయన కోరారు. రైతులకు సరసమైన ధరలు అందుతున్నాయా, వారి ఖాతాల్లోకి నగదు జమ అవుతుందా లేదా అని తమ సంస్థ పర్యవేక్షిస్తుందన్నారు. మూడున్నర సంవత్సరాలకు పైగా వయసు కలిగిన కలప, రైతులకు మాత్రమే ఐటిసి ప్రయోజనం కలిగిస్తుందన్నారు.