తెలంగాణ

విమోచన దినోత్సవం పాటిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 17న పాటిద్దామని శాసనసభలో బిజెపి నేత జి. కిషన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో బుధవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఆనాటి కాంగ్రెస్ అంగీకరించలేదంటూ కే. చంద్రశేఖరరావు ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ విమోచనా దినోత్సవం నిర్వహించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ నుండి బయటకు రావాలంటూ కేసీఆర్ పిలుపు ఇచ్చిన విషయం కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా నిర్వహించేందుకు ఇప్పుడు కేసీఆర్ ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న నిర్వహించేందుకు వీలుగా టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నుండి బయటకు రావాలని కిషన్ రెడ్డి కోరారు. 60 సంవత్సరాల సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో పభుత్వం తెలంగాణ కోసం చేసిన అప్పులు 62 వేల కోట్ల రూపాయలు కాగా, గత నాలుగు సంవత్సరాల్లో ఈ అప్పు రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని, ధర్నాలు, నిరసనలు చేయనివ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కాళ్లకు మాత్రమే సంకెళ్లు వేయగా, ఇప్పుడు టీఆర్‌ఎస్ సర్కారు ఆందోళన చేస్తున్న వారి చేతులు, కాళ్లకు కూడా సంకెళ్లు వేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ఎవరు కూడా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేయకుండా నిర్బంధం విధిస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ సరిగా జరగలేదని, డబుల్‌బెడ్‌రూం ఇళ్లనిర్మాణం కొనసాగడం లేదని, దళితులు, గిరిజనులకు మూడెకరాల సాగుభూమి పంపిణీ కావడం లేదని, విద్యార్థులకు ఫీజులను చెల్లించడం లేదని, రైతులకు వడ్డీ రాయితీ ఇవ్వడం లేదని, రైతు సమన్వయ సమితిలను టీఆర్‌ఎస్ కార్యకర్తలతో నింపివేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్‌లోకి మారాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాగునీటి సమస్య పరిష్కరించలేదని, కరవుకు గురైన రైతులను ఆదుకోవడం లేదని, రైతుల ఆత్మహత్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళన చేస్తే అణచివేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు దోపిడీచేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆపలేకపోతోందని ఆరోపించారు.
వెయ్యికోట్లు ఇవ్వండి: ఆర్. కృష్ణయ్య
మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాస్ (ఎంబిసి) కార్పోరేషన్‌కు 2017-18 సంవత్సరంలో వెయ్యికోట్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదని టిడిపి ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ఎస్‌సి, ఎస్‌టిలకు నాలుగేళ్లలో రుణాలు ఇవ్వలేదన్నారు. బిసి రిజర్వేషన్లను 25 శాతం నుండి 50 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్యను పెంచినప్పటికీ, ఉద్యోగ ఖాళీలను మాత్రం భర్తీ చేయలేదని ఆరోపించారు. ఆఫీసుల్లో కీలకమైన గ్రూఫ్ ఫోర్ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.
టీఆర్‌ఎస్ హయాంలో ప్రజలపై తీవ్రమైన నిర్బందం కొనసాగుతోందని సిపిఎం సభ్యుడు సున్నం రాజయ్య ఆరోపించారు. పేదలకు సామాజిక న్యాయం కోసం ప్రత్యామ్నాయ విధానాలు కావాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.