తెలంగాణ

రెండు వారాలు పని ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వివాదంలో ఉన్న స్ధలంలో పోలీసు కమాండ్ జంట టవర్ల నిర్మాణాన్ని రెండు వారాల పాటు నిలుపుదల చేయాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్, జస్టిస్ సి నాగప్పన్‌తో కూడిన బెంచి ఈ ఆదేశాలు వెలువరించింది. మీర్ అఫ్సర్ అలీ మరో 16మంది పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు డివిజన్ బెంచి తమ పిటిషన్‌ను కొట్టివేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కమాండ్ సెంటర్‌కు మొత్తం 8 ఎకరాలను కేటాయించారని, ఇందులో 5 ఎకరాలను తాము అనుభవిస్తున్నామని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఈ భూమిని క్రమబద్ధీకరించాలని తాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 సంవత్సరంలో పిటిషన్ దాఖలు చేయగా, అదే ఏడాది ఏప్రిల్ 30వ తేదీన రెవెన్యూ శాఖ తిరస్కరించారన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జిని ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచిని ఆశ్రయించారన్నారు. హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టేను తొలగించారన్నారు. అనంతరం సుప్రీం కోర్టు బెంచి రెండు వారాల పాటు వివాద స్ధలంలో పోలీసు కమాండ్ సెంటర్ నిర్మంచరాదని ఆదేశాలు జారీ చేసింది.