తెలంగాణ

వాచీలు, సెల్‌ఫోన్లు నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: తెలంగాణ ఎమ్సెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు కన్వీనర్, జెఎన్‌టియుహెచ్ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్‌వి రమణారావు శుక్రవారంనాడు చెప్పారు. ఇంజనీరింగ్‌కు 1,43,481 మంది, మెడికల్‌కు 1,00,983 మంది దరఖాస్తు చేశారని, వారందరికీ హాల్‌టిక్కెట్లు జారీ చేశామని చెప్పారు. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇంజనీరింగ్‌కు 276, మెడికల్‌కు 190 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆన్‌లైన్ పరీక్షకు దరఖాస్తు చేసిన వారి కోసం హైదరాబాద్‌లో మూడు కేంద్రాలు, వరంగల్‌లో ఒక కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. ఫలితాలను ఏప్రిల్ 27లోగా వెల్లడిస్తామని, 15న తొలి కీ విడుదల చేస్తామని, ఫలితాలతోపాటు విద్యార్ధుల వ్యక్తిగత ఒఎంఆర్ కాపీలు నెట్‌లో ఉంచుతామని అన్నారు. ఎమ్సెట్ ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలకు కలిపి మొత్తం 470 కేంద్రాల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆంధ్రాలో నాలుగు పట్టణాల్లో టిఎస్ ఎమ్సెట్‌కు రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయ 10 నుండి ఒంటి గంట వరకూ జరుగుతుందని, మెడికల్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకూ జరుగుతుందని పేర్కొన్నారు.
సెల్‌ఫోన్లు తీసుకురావద్దు
అభ్యర్ధులు పరీక్ష కేంద్రాలకు సెల్‌ఫోన్లు తీసుకురావద్దని కన్వీనర్ రమణారావు సూచించారు. ఎమ్సెట్ పరీక్ష సందర్భంగా ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా వాచీలు, కళ్లద్దాలు, లావుపాటి పెన్నులను నిషేధించామని చెప్పారు. అనుమానిత వస్తువులు దేనినీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని, ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా అలాంటి అనుమానం ఉన్న వాటిని అనుమతించబోమని, ప్రతి చోట తనిఖీ ఉంటుందని అన్నారు.
ఒక్క నిమిషం నిబంధన
హాల్‌టిక్కెట్లతోపాటు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకుని పరీక్షకు హాజరుకావాలని కన్వీనర్ రమణారావు చెప్పారు. కచ్చితంగా ఒక్క నిమిషం నిబంధన అమలుచేస్తామని కనుక ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
పరీక్ష కేంద్రంలో వేలిముద్రలు, సంతకాలు
పరీక్ష కేంద్రంలో ప్రతి అభ్యర్ధి వేలిముద్రలు, సంతకాలు, ఫోటోలను సేకరిస్తామని వారు చెప్పారు. ఈ డాటా బ్యాంకు రానున్న రోజుల్లో అడ్మిషన్లకు , ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పనికొస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పరీక్ష కేంద్రాల్లో సేకరించిన సమాచారాన్ని అపుడు రీ వెరిఫికేషన్ చేస్తామని చెప్పారు.