తెలంగాణ

గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, మార్చి 18: గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దేశ్యానాయక్ డిమాండ్ నేడొ క ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 16 తెగలకు సంబందించిన గిరిజనులు 9.91 శాతం దాదాపు 40 లక్షల జనాభా ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం 10శాతం రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల ప్రభుత్వ నోటిఫికేషన్‌లో జనాభానిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కేటాయించకుం డా గిరిజనులు అన్యాయనికి గురవుతున్నారన్నారు. కాబట్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో రిజర్వేషన్ వెంటనే ప్రకటించి న్యాయం చేయలని కోరారు. గిరిజనులకు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారని వారిని అదుకోవాలన్నారు. గిరిజన తాండలను, గుడెంలను గ్రామపంచాయతీలుగా గుర్తించాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.