తెలంగాణ

ఆర్థిక నిర్వహణలో తెలంగాణ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఆర్ధికంగా నిధుల కొరత తలెత్తి సంక్షోభంలో కూరుకుపోతుందన్న వాదనలు పటాపంచాలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రుణ భార యాజమాన్య విధానాల్లో అత్యంత ఆధునిక ఆర్థిక సాంకేతిక విధానాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోంది. అప్పులు ఉన్నా, సాలీనా పెరుగుతున్నా, సొంత పన్నుల ఆదాయం, పనే్నతర ఆదాయం వల్ల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ముందు దిగదుడుపుగా మారాయి. విద్యుత్ రంగంలో స్వావలంబన సాధించినట్లుగానే, రాష్ట్ర బడ్జెట్ నిర్వహణలో కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ జాగ్రత్తపడుతూ సంక్షేమం, అభివృద్ధి అనే మంత్రాలను వదలకుండా, దుబారాకు పోకుండా ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేస్తోంది. తెలంగాణ రాష్ట్రం జిడిపి మొత్తం రూ. 7.49 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో రాష్ట్రం అప్పుల శాతం 18.6 శాతానికి చేరుకుంది. 2014-15లో రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు రాష్ట్ర జిడిపిలో అప్పుల శాతం 16.1 శాతంగా ఉండేది. రుణ భారం పెరగడంతో ప్రతి ఏడాది అసలు, వడ్డీ చెల్లింపులు కూడా కాకతాళీయంగా పెరుగుతున్నాయి. దేశం మొత్తం మీద మిజోరం, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో జీడీపీలో అప్పుల వాటా 50 శాతం నమోదైంది. ఢిల్లీ బడ్జెట్‌లో జీడీపీలో అప్పుల వాటా 5.9 శాతం. కాగా దేశం మొత్తం మీద జిడిపిలో అప్పుల వాటా ఉన్న రాష్ట్రాల్లో 28 వ స్థానంలో తెలంగాణ ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ. కాని బడ్జెట్ నిర్వహణలో ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకుంటున్న చర్యల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. 2015-16లో రూ.2849 కోట్లు, 2016-17లో 3149 కోట్లు రుణాలపై అసలుగా చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో రూ. 4659 కోట్లను అసలుగా చెల్లిస్తారు. కాగా 2015-16లో రూ. 7558 కోట్లను, 2016-17లో రూ. 7706 కోట్లను చెల్లించారు. ఈ ఏడాది రూ.11,139 కోట్లను చెల్లించాలి. రాష్ట్రంలో అప్పులు 2015-16లో రూ. 93,115 కోట్లు, 2016-17లో రూ.1,27,829 కోట్లు, 2017-18లో రూ.1,51,133 కోట్లు, 2018-19లో రూ.1,80,238 కోట్లను తేల్చారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర కార్పొరేషన్ల పేరిట రూ. 41,538 కోట్ల అప్పును తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ అప్పుల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం విపరీతంగా అభివృద్ధి చెందే అవకాశం కనపడుతోంది. తెలంగాణ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ ద్వారా మరో రూ.20 వేల కోట్ల రుణాలను తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.23వేల కోట్లు, వచ్చే సంవత్సరం రూ.29 వేల కోట్లమేర అప్పులు తీసుకునే సదుపాయాన్ని కేంద్రం తెలంగాణకు కల్పిచింది. నిబంధనల ప్రకారం జీఎస్‌డీపీలో అప్పుల శాతం 25 శాతం దాటితే తప్ప తెలంగాణకు అంతవరకు అప్పులు ఇచ్చేందుకు కేంద్రం, ఇతర ఏజన్సీలు పోటీలుపడుతుంటాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, పన్నులు చెల్లింపులు బాగా ఉండడం వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ముప్పు లేదు.
కాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇండియా అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం 2019-20 సంవత్సరం నుంచి ఎక్కువ మొత్తంలో అసలు, వడ్డీలను చెల్లించాల్సి వస్తుందని అంచనా వేసింది. 2019-20 నుంచి సాలీనా రూ.14674 కోట్లు, 2021-23 సంవత్సరాల్లో రూ. 17,773 కోట్ల చొప్పున అప్పులను చెల్లించాల్సి వస్తుందని అంచనా వేసింది. ఇప్పుడు చెల్లిస్తున్న అసలు కంటే మూడు రెట్లు ఎక్కువగా అసలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
కాగా తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 73,751.88 కోట్లు సొంత పన్నుల ద్వారా, పనే్నతర ఆదాయం ద్వారా రూ. 8973.92 కోట్లు, కేంద్రం పన్నుల వాటా ద్వారా రూ.19,207.43 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా రూ. 29041.88 కోట్లను పొందే అవకాశం ఉందని అంచనా. సొంత పన్నుల ద్వారా ప్రస్తుత సంవత్సరంలో రూ.62,619 కోట్లు వస్తాయని అంచనా. వచ్చే ఏడాది మొత్తం బడ్జెట్‌లో రూ.1.74 లక్షల కోట్లలో ప్రగతి పద్దుగా రూ.11.04 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.69,695 కోట్లను చూపించారు.