తెలంగాణ

పెరిగిన అడవుల విస్తీర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 24 నుంచి 33 శాతానికి విస్తరించాలనే లక్ష్యంతో కెసిఆర్ సర్కార్ చేపట్టిన హరిత హారం పథకం సత్ఫలితాలను ఇస్తోంది. గత మూడున్నరేళ్లలో చేపట్టిన అడవుల పెంపకం, హరిత హారం కార్యక్రమం వల్ల అదనంగా 565 చ.కిమీ విస్తీర్ణంలో అడవులు, పచ్చదనం పెరిగాయి. ఈ వివరాలను సామాజిక, ఆర్థిక అవుట్‌లుక్ పేర్కొంది. తెలంగాణ హరిత హారం ద్వారా 230 కోట్ల మొక్కలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 27,291.99 చ.కిమీ ఉంది. రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం 24.04 శాతంగా ఉంది. అడవుల వెలుపల అడవులను పెంచాలని, చెరువులు, కాలనీలు, సామాజిక వ్యవసాయ క్షేత్రాలు, కాల్వలు, కొండల వద్ద మొక్కల పెంపకాన్ని అభివృద్ధి చేయాలని, తద్వారా 33 శాతం అడవులు ఉండాలన్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ప్రభుత్వం సంకల్పంగా ఉంది. మొదటి మూడు సంవత్సరాల్లో దాదాపు 81.61 కోట్ల మొక్కలను నాటారు.
ఇందులో 70.75 కోట్లమొక్కలను అడవులకు వెలుపల, అడవుల్లో 10.86 కోట్ల మొక్కలను నాటారు. హరిత హారం కార్యక్రమం మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, మేడ్చెల్-మల్కాజగిరి, ఖమ్మం జిల్లాల్లో వంద శాతానికి పైగా లక్ష్యాలను సాధించారు. నిర్మల్‌లో 59.5, రంగారెడ్డి జిల్లాలో 41.7 శాతం, వికారాబాద్ 57.9, మహబూబ్‌నగర్ జిల్లాలో 57 శాతంతో వెనకబడి ఉన్నాయి.
వచ్చే ఏడాది 40 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 4.81 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలతో 30808 గ్రీన్ బ్రిగేడ్‌లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 40 క్షీర జంతువులు, 365 రకాల పక్షులువ, 52 కీటక రకాలు, 153 సీతాకోకచిలుకల రకాలు, 30 స్పైడర్ జాతి రకాలు, 15 ఉభయ చర జీవులు, 48 రకాలు సరీసృపాలు ఉన్నాయి. వీటి పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం 12 రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వును 2166.37 చ.కి.మీ విస్తీర్ణంలో, కవాల్ టైగర్ రిజర్వును 892.23 చ.కిమీ విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ప్రాణహిత, శివరాం, ఏటూరునాగారం, పాకాల్, కినె్నరసాని, మంజీరా, పోచారంలలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను నెలకొల్పారు.