తెలంగాణ

పేదలకు నిజమైన ‘ఆసరా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: ఆసరా నిజంగా పేదలకు ఆసరాగానే నిలిచింది. ప్రతి నెల అర్హులైన పేదలకు, లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 1000ను ప్రభుత్వం జమ చేస్తోంది. వచ్చే బడ్జెట్‌లో రూ. 5300 కోట్లను కేటాయించారు. దాదాపు 41,78,291 మందికి లబ్ధి చేకూర్చనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు కలిపి రూ.853 కోట్లు మంజూరు చేసి 31 లక్షల మందికి నెలకు రూ.200 ఇచ్చేవారు.
ఆసరా పెన్షన్లను వితంతువులు, కల్లు గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆసరా పెన్షన్లను ఎక్కువ సంఖ్యలో నిజామాబాద్ జిల్లాలో ఇస్తున్నారు. ఈ జిల్లాలో 2,61,976 మందికి, ఆ తర్వాత జగిత్యాల జిల్లాలో 2,11,714 మందికి, నల్లగొండ జిల్లాలో 1,91,692 మందికి ఇస్తున్నారు. చివరి స్థానంలో కొమురం భీం జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 50017 మందికి మాత్రమే ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 69,297 మందికి, మంచిర్యాలలో 90813 మందికి, నిర్మల్ జిల్లాలో 1,46 504 మందికి, పెద్దపల్లి జిల్లాలో 80535 మందికి, జయశంకర్ జిల్లాలో 90584 మందికి, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో 1,03,536 మందికి, మహబూబాబాద్ జిల్లాలో 1,02,760 మందికి, ఖమ్మం జిల్లాలో 1,66,165 మందికి, సూర్యాపేట జిల్లాలో 1,39,286 మందికి, నాగర్‌కర్నూలు జిల్లాలో 1,06,702 మందికి, వనపర్తి జిల్లాలో 71,943 మందికి, జోగుళాంబ జిల్లాలో 68027 మందికి, వికారాబాద్ జిల్లాలో 1,06,767 మందికి, రంగారెడ్డి జిల్లాలో 1,71,847 మందికి, హైదరాబాద్‌లో 1,91,628 మందికి, మేడ్చెల్-మల్కాజగిరి జిల్లాలో 1,05,149 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 92,934 మందికి, జనగాంలో 79,282 మందికి, సిద్ధిపేట జిల్లాలో 1,64,136 మందికి, సంగారెడ్డి జిల్లాలో 1,38,882 మందికి, మెదక్ జిల్లాలో 1,02,090 మందికి, కామారెడ్డిలో 1,59,668 మందికి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,14,318 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు.