తెలంగాణ

సేంథ్రీయ సేద్యంపై అగ్రివర్సిటీ, వర్షా మధ్య ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: సేంద్రీయ వ్యవసాయం, బయోఫెర్టిలైజర్స్ తయారీలో విద్యార్థుల నైపుణ్యం పెంపొందించేందుకు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ‘వర్షా’ బయోసైనె్సస్ (సైదాబాద్-హైదరాబాద్) మధ్య సోమవారం అవగాహనా ఒప్పందం కుదిరింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు సమక్షంలో ఒప్పంద పత్రాలపై రెండు సంస్థల మధ్య సంతకాలు జరిగాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. సుధీర్‌కుమార్, వర్షా బయోసైనె్సస్ చైర్మన్ డాక్టర్ ఎ. జాన్ పీటర్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల యూజీ, పీజీ విద్యార్థులకు సేంద్రీయ సేద్యం, బయోఫెర్టిలైజర్స్ అంశాలపై నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తారు. బయోఫెర్టిలైజర్స్ తయారీలో బీఎస్సీ విద్యార్థులకు ఎక్స్‌పీరియన్స్ లెర్నింగ్‌లో భాగంగా ఒక యూనిట్‌ను విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయాలని వర్షా బయోసైనె్సస్ సంస్థ ప్రతినిధులకు ఉపకులపతి ప్రవీణ్‌రావు సూచించారు. ఈ కార్యక్రంమలో విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు డాక్టర్ కేఎస్ డాంగీ, డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ టి. ప్రదీప్, డాక్టర్ కెవిఎస్ మీనాకుమారి, డాక్టర్ జమునారాణి, డాక్టర్ మృణాళిని డాక్టర్ సదాశివరావు, డాక్టర్ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.