తెలంగాణ

టెన్త్ పేపర్ లీక్ కాలేథు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి ఇంగ్లీషు పేపర్ -1 ప్రశ్నాపత్రం ఎక్కడా లీక్ కాలేదని పాఠశాల విద్య సంచాలకుడు జి కిషన్ సోమవారం రాత్రి పేర్కొన్నారు. అక్కడక్కడా కొంత మంది విద్యార్థులు, ఇన్విజిలేటర్లు మాల్ ప్రాక్టీసుకు ప్రయత్నించారని, అంతే తప్ప పేపర్ లీక్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం నాడు యథాతథంగా ఇంగ్లీషు పేపర్-2 జరుగుతుందని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇంగ్లీషు ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టినా అదంతా అసత్య ప్రచారమని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌లో పేపర్‌లీక్ అయినట్టు భావిస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ స్పష్టం చేసినా, అలాంటిదేమీ లేదని కమిషనర్ పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభం అయిన ఐదు నిమిషాల్లోనే పేపర్ బయటకు వెళ్లిందని అంగీకరిస్తున్న అధికారులు మాత్రం పేపర్ లీక్ కాలేదని బుకాయిస్తున్నారు. ఇదే ఘటనపై
మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌లో ఐదుగుర్ని అరెస్టు చేయగా, ఆ సెంటర్‌లో విధుల్లో ఉన్న ముగ్గురు కీలక అధికారులను సస్పెండ్ చేసి, మిగిలిన వారిని రిలీవ్ చేశారు. ఇదంతా ఎందుకు అని ప్రశ్నిస్తే మాల్ ప్రాక్టీసుకు
ప్రోత్సహించినందుకే చర్యలు తీసుకున్నామని కమిషనర్ కిషన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తున్న ఇద్దర్ని గుర్తించామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం తాడిహత్నూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లీషు ప్రశ్నాపత్రం ఫోటో కాపీని తీయడంలో ఒక ఇన్విజిలేటర్ ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడం అధికారులు గుర్తించారని కమిషనర్ పేర్కొన్నారు. దీంతో చీఫ్ సూపరింటెండెంట్ భరత్ చౌహాన్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ జగన్మోహన్, కస్టోడియన్ నాగోరావు, ఇన్విజిలేటర్ కృష్ణవేణిలను సస్పెండ్ చేశామని అన్నారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో బయటి నుండి ఒక వ్యక్తి కాంపౌండ్ వాల్ గెంతి లోపలికి వచ్చి పరీక్ష రాస్తున్న అభ్యర్థి సహకారంతో ప్రశ్నాపత్రం ఫోటో కాపీ తీశాడని అన్నారు. ఈ పరీక్ష కేంద్రంలోని మొత్తం సిబ్బందిని రిలీవ్ చేశామని, ఇందుకు సంబంధించి పోలీసు కేసు కూడా నమోదు చేశామని పేర్కొన్నారు. మరో పక్క సూర్యాపేట జిల్లాలో ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశామని కమిషనర్ వెల్లడించారు.