తెలంగాణ

ఫీజుల దోపిడీని నిరోధించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీ నియంత్రణకు చట్టం చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం విద్యానగర్‌లోని బిసి భవన్‌లో జరిగిన వివిధ బిసి సంఘాల విస్తృత స్థాయి సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య ప్రసంగిస్తూ ఇటీవల కాలంలో కార్పోరేటు, ప్రైవేటు విద్యా సంస్థలు చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని అన్నారు. 10 సంవత్సరాల క్రితం ప్రైవేటు విద్యా సంస్థలలో కేవలం 10 శాతం విద్యార్థులు ఉండే వారని, ఇప్పుడు 54 శాతానికి చేరుకుందని తెలిపారు. 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది విద్యార్థులు ఉండగా 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని ఆయన చెప్పారు.