తెలంగాణ

18 నుంచి నగరంలో సిపిఎం జాతీయ మహా సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: వచ్చే నెల 18 నుంచి 22వ తేదీ వరకు నగరంలో తమ పార్టీ అఖిల భారత మహా సభలు నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 22న బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మహా సభలను, భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఈ నెల 24 బస్సు యాత్రలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. మొదటి జాతాను మార్చి 24న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవుల ప్రారంభిస్తారని, రెండవ జాతాను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భువనగిరిలో ప్రారంభిస్తారని ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలపై మోపుతున్న భారాలు, అవినీతి, అవకాశవాద, నిరంకుశ ధోరణులను విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఇలాఉండగా ఈ మహాసభలకు పార్టీ జాతీయ నాయకులు తరలి రానున్నందున భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులు, ఎత్తులపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.