తెలంగాణ

విభజన హామీల అమలుకు కేంద్రంపై టీఆర్‌ఎస్ ఒత్తిడి తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేసేలా కేంద్రంపై వత్తిడి తీసుకుని రావాలని టి.టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి టిఆర్‌ఎస్‌ను డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. కాగా విభజన చట్టంలోని హామీలు అమలు చేయడం లేదని టిడిపి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే టిఆర్‌ఎస్ మద్దతు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ సందర్భంగా తెలంగాణకు రావాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఎయిమ్స్ వంటి హామీలపై కేంద్రాన్ని నిలదీసేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమావేశం