తెలంగాణ

సభ ముగిసేవరకూ మంత్రులు ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చార్మినార్, మార్చి 19: శాసన మండలి సమావేశం ప్రారంభమైన తర్వాత ముగిసేంత వరకు మంత్రులు, సభ్యులు ఉండాలని శాసన మండలి చైర్మన్ స్వామీగౌడ్ సూచించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పేలా మంత్రులు అందుబాటులో ఉండాలని, ప్రశ్నల ప్రకారం సమాధానాలు చెప్పేందుకు మంత్రులు సభకు వచ్చినపుడు సభ్యులు కూడా విధి ఉండాలని ఆయన సూచించారు. సోమవారం శాసనమండలి సమావేశంలో తొలుత ప్రశ్నోత్తరాలు, ఆ తర్వాత బడ్జెట్‌పై చర్చ జరిగింది. భాషా పండితుల అప్‌గ్రేడ్‌పై సభ్యుడు పి.సుధాకర్‌రెడ్డి, కే.జనార్దన్ రెడ్డి, పూల రవీందర్‌లు ప్రశ్నించారు. భానుప్రసాద్, భూపాల్‌రెడ్డిలు రైతులకు పెట్టుబడి సహాయ పథకంపై, సభ్యులు పల్లారాజేశ్వర్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, కసిరెడ్డి నారాయణరెడ్డిలు దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్ అంశాలపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో భాషా పండితులు 2487 మంది ఉన్నారని, వారిని స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసేందుకు మంజూరీ ఇచ్చినట్లు తెలిపారు. సంవత్సరం క్రితమే ఇందుకు జీవో జారీ చేశామన్నారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో దివ్యాంగులు, వయోవృద్దులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించామన్నారు. డీలక్స్ సర్వీసుల్లో యాభై శాతం రాయితీ ఉందని వివరించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లోని పలు అంశాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి నిధులు వచ్చేందుకు ఆలస్యం జరిగిందని వివరించారు. ప్రస్తుతం నెలవారీ జీతాలు యదావిధిగా చెల్లిస్తున్నట్లు, తాత్కాలిక ఉద్యోగులకు జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించిన ధరల ప్రకారమే చెల్లిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాలు సాగులో ఉందని, రైతుకు ఒక సీజన్‌లో రూ.4వేలు చొప్పున చెక్కుల ద్వారా చెల్లిస్తున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సభ్యుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇది ఎన్నికల బడ్జెట్: బీజేపీ
ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్, అంకెల గారడీ అని మండలిలో బీజేపీ సభ్యుడు రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. కొన్ని అంశాలకు సంబంధించి చూస్తే కేటాయింపులు బాగానే ఉన్నా, మొత్తంగా గమనిస్తే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అన్నారు. గతంలో మిగులు రెవెన్యూ బడ్జెట్ ఉండగా, ఇపుడు జనాభాలో ఒక్కొక్కరిపై రూ. 54వేల వరకు అప్పు పెరిగిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు నిర్ణయించిన గడువు కూడా దగ్గరపడుతున్నా, నగరంలో లక్ష ఇళ్లను ఎపుడు నిర్మిస్తారని ప్రశ్నించారు. న్యాయవాదులకు గత బడ్జెట్‌లో కూడా రూ. వెయ్యి కోట్లను కేటాయించిన ప్రభుత్వం అందులో ఎంత వరకు ఖర్చు చేసింది? ఎవరికి కేటాయించిందో వివరించాలన్నారు.