తెలంగాణ

రామ రథయాత్రను అడ్డుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: విశ్వహిందు పరిషత్ నిర్వహించతలపెట్టిన రధయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఉడిపిలో జరిగిన సాదుసంతుల సమ్మేళనంలో ఉగాది నుంచి పౌర్ణమి వరకు రామనామ జపాలు, రామ రాధయాత్రలు నిర్వహించాలని సాదువులు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగా నగరంలోని వీహెచ్‌పీ కార్యాలయంలో రధాన్ని సిద్దం చేశారు. మొదట రధాన్ని బాసరలోని సరస్వతి ఆలయానికి తీసుకువెళ్లి అక్కడి నుంచి రధయాత్రను ప్రారంభించాల్సి ఉంది. పోలీసులు బాసరకు బయలుదేరుతున్న రధాన్ని నగరంలోనే అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. యాత్ర బాసర నుంచి ప్రారంభం అయి హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉందని శాంతియుతంగా నిర్వహించతలపెట్టిన దైవ యాత్రను ఎలా అడ్డుకుంటారని వీహెచ్‌పీ నాయకులు నిలదీయడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటూ వందల సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు బయటకు రాకుండా కట్టడి చేశారు. దీంతో వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ చర్యను వీహెచ్‌పీ అధ్యక్షుడు రామరాజు, అధికారప్రతినిధి శశిధర్‌లు తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హిందువులు శాంతియుతంగా నిర్వహించతలపెట్టిన యాత్రను అడ్డుకుందని మండిపడ్డారు. హిందువుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దైవ సంబంద యాత్రలకు బందోబస్తు కల్పిచాల్సిన ప్రభుత్వం వాటిని నియంత్రించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం యొక్క కుటిల కుట్రల్లో పోలీసులు భాగస్వామ్యం కావద్దు అన్నారు. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు ప్రజా క్షేత్రంలో ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు.