తెలంగాణ

ఫెడరల్ అడుగు పడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: పది లక్షల కిలో మీటర్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుందని చెప్పే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు సోమవారం తొలి అడుగు వేశారు. ఫ్రంట్ ఏర్పాటుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమత బెనర్జీతో చర్చించడానికి సోమవారం ప్రత్యేక విమానంలో సిఎం కేసీఆర్ కోల్‌కతాకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి వెంట ఎంపిలు కె కేశవరావు, కవిత, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, మాజీ డిజిపి అరవింద్ శర్మ, సిఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయానికి సిఎం కేసీఆర్ బయలుదేరడానికి ముందు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు వీడ్కోలు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ. లక్ష 116లకు పెంచుతున్నట్టు సభలో ప్రకటించి ప్రగతి భవన్‌కు అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.

చిత్రాలు..కోల్‌కతా వెళ్లడానికి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కేసీఆర్,
* వీడ్కోలు పలుకుతున్న మంత్రులు, పార్టీ నేతలు
*కోల్‌కతా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాళీమాతను దర్శించుకున్న దృశ్యం