తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యపై సోమవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో యూనియన్ నేతలతో మంత్రులు హరీష్‌రావు, మహేందర్ రెడ్డి, పద్మారావుగౌడ్ చర్చించారు. టి మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, ఇతర నాయకులు సంస్థ స్థితిగతులు, కార్మికుల జీతభత్యాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో ఎండీ రమణారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మంగళవారం కూడా మరోమారు సమావేశం జరగనుందని అశ్వత్థామరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.