తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల పార్కింగ్‌కు ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పార్కింగ్ సదుపాయం కోసం ఒక పక్కా ప్రణాళికను ఖరారు చేసి అమలు చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే వి శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ, జిహెచ్‌ఎంసి పరిధిలో 10,15,431 నాలుగు చక్రాల వాహనాలు, 40,14,034 ద్విచక్రవాహనాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల కోసం ప్రణాళిక, అభివృద్ధి కార్యకలాపాలు, అమలు నిర్వహణ వంటి పార్కింగ్‌కు సంబంధించి జీవో 187ను గత ఏడాది జూలై 7వ తేదీన విడుదల చేశామన్నారు. ఖాళీ భూమి ఉన్న యజమానులు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసేందుకు అసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని జిహెచ్‌ఎంసి కోరిందన్నారు. ప్రైవేట్ బహిరంగ ప్లాట్లలో పార్కింగ్ శాస్ర్తియ నిర్వహణతో పాటుగా పార్కింగ్ విధానానికి అనుగుణంగా పార్కింగ్ ప్రాంతాలను పెంచేందుకు ఏజెంట్ల నియామకం కోసం ఇటీవలే ప్రతిపాదన తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.