తెలంగాణ

20 ఏళ్లు మాదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణలో రానున్న 20 ఏళ్లు టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రం ఒక ప్రయోగశాలగా ఉందని, గొప్ప పథకాలు తెలంగాణలో అమలులో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏ సభలో అయితే అవమానానికి గురయ్యారో అదే సభలో అదే వ్యక్తి ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు అంతా చూస్తున్నారని అన్నారు. దేశంలో ఉన్న వారందరికీ తెలంగాణ అభివృద్ధి కనిపిస్తుంటే కొంత మందికి మాత్రం కనిపించకపోవడం దారుణమని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. మూడు సంవత్సరాల పది నెలల కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందని అన్నారు. దేశ జీడీపీ కంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువగా ఉందని, అదే ప్రగతికి తార్కాణమని అన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట వేశారని, ప్రతిపక్షంలో ఉన్న వారికి అభివృద్ధి కనబడకపోవడం దురదృష్టకరమని అన్నారు. సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది అన్నట్టు ఇక్కడి కేటాయింపులను గత ప్రభుత్వాలు ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లారని, తెలంగాణ అడుగడుగునా అన్యాయానికి గురైందని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు దగ్గర అవుతుంటే విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.