తెలంగాణ

ఆగని ఏపీ ఉద్యోగుల కుట్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా ఏపీ ఉద్యోగుల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని టీ ఎన్‌జీ ఓ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఏపీ ఉద్యోగుల చేరికలను నిరసిస్తూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌదాలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్ సౌదాలో నిర్వహించిన నిరసన ర్యాలీకి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు ఉమ్మడి హైకోర్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి విద్యుత్ ఉద్యోగులు రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఎంతో శ్రమించి రైతులకు 24 గంటల విద్యుత్ అం దించే స్థాయికి తీసుకువచ్చారని అన్నారు. ఉద్యోగుల విభజన కేవలం సంస్థలకు సంబంధించినదే కాదని, ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరగకుండా విభజన జరిగేలా చూడాలని కోరారు.
ఇక్కడి ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఏపీ ఉద్యోగులను సంస్థల్లోకి తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించడం తమ ను తీవ్రంగా కలిచివేసిందని జేఏసీ చైర్మన్ శివాజీ అన్నారు.