తెలంగాణ

మైనారిటీ గురుకుల పాఠశాలల్లో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు 50 శాతం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: మైనారిటీ గురుకుల పాఠశాలలో బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు 50 శాతానికి పైగా ఉన్న రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు తెలిపారు. రాష్ట్రంలో 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఉన్నాయని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిసిల కు 12 శాతం, ఎస్‌సిలకు 6 శాతం, ఎస్‌టిలకు 4 శాతం, ఒసిలకు 3 శాతం కలిపి మొత్తం 25 శాతం, కాగా ముస్లింలకు 64 శాతం, క్రిస్టియన్లకు 7 శాతం, జైన్‌లకు, పర్సిస్‌లకు, బుద్దీస్ట్‌లకు, సిక్కులకు ఒక్కో శాతం, ఇలా ముస్లిం కానీ వారికి ప్రతి క్లాస్‌లో 14 సీట్లకు పైగా లభిస్తాయని వివరించారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించా రు. ప్రతి క్లాసులో బిసిలకు 5 సీట్లు, ఎస్‌సిలకు 2 సీట్లు, ఎస్‌టిలకు 2 సీట్లు, ఒసిలకు ఒక సీటు రిజర్వేషన్ ఉందని తెలిపారు.