తెలంగాణ

స్వామిగౌడ్‌కు గాయం అయ్యిందని అడ్వకేట్ జనరల్ చెప్పలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ కే. స్వామిగౌడ్‌కు గాయం అయ్యిందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించ లేదని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి నివాసంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎ. రేవంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. సమావేశానంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన ఘటనపై హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజప పక్షాన మాట్లాడుతున్న తమను సభ నుంచి సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేశారని అన్నారు. గవర్నర్ ప్రసం గం సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్‌కు గాయమైందని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో చెప్పలేదన్నారు. స్వామిగౌడ్ అంటే తమకు అభిమానం ఉందన్నారు. దెబ్బ తగిలితే దానికి ఆధారాలు చూపించాలని తాము అడిగినా ఇంత వరకూ చూపించలేదని అన్నారు. తమ కు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని ఆయన తెలిపారు. సమావేశాల నుంచి బహిష్కరణకు గురైన తాము రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొంటామని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంక ట వీరయ్యను కోరామని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలుపొందిన ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థి బలరాం నాయక్‌కు ఓటు వేయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు.
‘విప్’ మార్పు..
ఇలాఉండగా అసెంబ్లీలో కాంగ్రెస్ విప్‌గా ఉన్న సంపత్ కుమార్ స్థానంలో టి. రాంమోహన్ రెడ్డిని నియమించినట్లు సిఎల్‌పి నేత కె. జానారెడ్డి మంగళవారం స్పీకర్ ఎస్. మధుసూదనాచారికి లిఖితపూర్వకంగా తెలిపారు.

చిత్రం..జానారెడ్డి నివాసంలో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు