తెలంగాణ

నేడు పాలేరు పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 15: అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావించి విస్తృతంగా ప్రచారం నిర్వహించిన పాలేరు ఉప ఎన్నిక సోమవారం జరగనున్నది. 4 గ్రామీణ మండలాల్లో విస్తరించివున్న ఈ నియోజకవర్గంలో 1,90,351 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా ఓటు వినియోగించుకునేందుకు 108 గ్రామపంచాయతీల పరిధిలో 243 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ బూత్‌లలో దేశంలోనే మొదటిసారిగా వివిప్యాట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఓటు వేసిన వ్యక్తి తాము ఎవరికి ఓటు వేసింది ఈ విధానం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే తొలిసారిగా 12 మోడల్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈ బూత్‌లను అందంగా అలంకరించడమే కాకుండా ఓటర్లకు సకలసౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ బూత్‌లలో ఓటు వేసే వారిని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించనున్నారు. ఒక్కొ మండలంలో ఒక్కొ గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామ పరిధిలోని 3 పోలింగ్ బూత్‌లను మోడల్ బూత్‌లుగా తయారు చేశారు.
ఇదిలా ఉండగా పాలేరు ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహించాయి. మొదటి నుంచి ఆసక్తికరంగా మారిన ఈ ఎన్నికలో ఎన్నికల కమిషన్‌కూడా సంచలన నిర్ణయాలను తీసుకున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారులపై ఫిర్యాదు చేయడంతో వారిని వెంటనే బదిలీ చేసింది. అలాగే సుమారు కోటి రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సుమారు 30 వాహనాలు అక్రమంగా తిరుగుతుండగా పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అలాగే 4 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేయడమే కాకుండా సుమారు 2 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమీషన్‌కు గతంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఫిర్యాదులు వచ్చాయి. గతానికి భిన్నంగా ఎన్నికల పరిశీలకుడు, వ్యయ పరిశీలకులకు తోడు పోలీసు పరిశీలకుడు కూడా ఈ ఎన్నికకు ప్రత్యేకంగా రావడం విశేషం. అంతే కాకుండా పోలింగ్ ఏర్పాట్లను వీరు స్వయంగా పరిశీలించడం గమనార్హం. అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద టెంట్‌లను వేయడంతో పాటు మంచినీటి సదుపాయాన్ని, వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు. ఈ ఎన్నికలో అనుసరించిన కొత్త విధానాలు సత్ఫలితాలు ఇస్తే దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లోనూ ఇవే విధానాలను అమలు చేస్తామని ఎన్నికల కమీషన్ ప్రకటించడం విశేషం.
chitram...
దేశంలోనే మొదటిసారి అన్ని పోలింగ్ బూత్‌లలో ఏర్పాటు చేసిన వివిప్యాట్