తెలంగాణ

‘కల్లు’ చెట్లపై పన్ను రథ్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ రాష్ట్రంలో కల్లు చెట్లపై (తాటి, ఈత, ఖర్జూర) ప్రభుత్వం వసూలు చేస్తున్న ‘చెట్లపన్ను’ను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రకటించారు. శాసనసభలో గురువారం వివిధ పద్దులపై చర్చ జరిగే ముందు ప్రత్యేకంగా గీతకార్మికుల సంక్షేమంపై ప్రకటన చేశారు. కల్లుచెట్లపై పన్ను రద్దు వల్ల ప్రభుత్వానికి ఏటా 16 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందన్నారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గుతున్నప్పటికీ, గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గీతకార్మికులు ఇప్పటివరకు చెల్లించాల్సిన చెట్లపన్ను బకాయిలను కూడా రద్దు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ‘గౌడ భవన’ నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని కేటాయిస్తామని, భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం తరఫున ఐదుకోట్ల రూపాయలు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. గీతకార్మికులకు ఇచ్చే పింఛన్‌ను 200 రూపాయల నుండి 1000 రూపాయలకు ఇప్పటికే పెంచామని సిఎం గుర్తు చేశారు. ఇప్పటి వరకు కల్లుగీత సొసైటీ సభ్యులకు మాత్రమే పింఛన్ లభిస్తోందని, ఇక నుండి టిఎఫ్‌టి (ట్రీ ఫర్ ట్యాపర్) కార్మికులకు కూడా పింఛన్ సౌకర్యాన్ని వర్తింపచేస్తామన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 30 వేల మంది గీతకార్మికుల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. టిఎఫ్‌టి నుండి టిసిఎస్ (ట్యాపర్ కోఆపరేటివ్ సొసైటీ) లోకి మారాలని గీతకార్మికులు ఎవరైనా దరఖాస్తు చేస్తే 10 రోజుల్లో బదలాయింపు జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కల్లు దుకాణాలను నడుపుకునేందుకు లైసెన్స్‌ల రెన్యువల్ గడవును ఐదేళ్ల నుండి పదేళ్లకు పెంచుతున్నామని తెలిపారు. దీనివల్ల గీతకార్మికులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తరచూ తిరిగే బాధతప్పుతుందన్నారు. గతంలో కల్లు చెట్టుపైనుండి కిందపడి మరణించిన వారికి రెండు లక్షల రూపాయలు చెల్లించేవాళ్లని, అలాగే గాయపడ్డ వారికి 50 వేల రూపాయలు పరిహారంగా ఇచ్చేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో చివరి మూడేళ్లలో ఆనాటి ప్రభుత్వం గీతకార్మికులకు బకాయిపడ్డ నష్టపరిహారం 6.38 కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం చెల్లించిదని గుర్తుచేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతోచెట్లపైనుండి కిందపడి మరణించినా, గాయపడ్డా ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని ఐదులక్షల రూపాయలకు పెంచామన్నారు.
గౌడ కులస్తులకు జరుగుతున్న అన్యాయం గురించి తెలంగాణ ఉద్యమం సమయంలో పదేపదే ప్రస్తావించానని కేసీఆర్ గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మూసేసిన కల్లు దుకాణాలను తెలిపిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే హైదరాబాద్‌లో కల్లుదుకాణాలను తిరిగి తెలిపించామన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 1.70 కోట్ల వరకు తాటి, ఈత, ఖర్జూర మొక్కలను నాటామని సిఎం తెలిపారు. భవిష్యత్తులో చెరువు కట్టలు, చెరువు శిఖం, వాగుల వెంట, నదీప్రవాహానికి ఇరువైపులా ఈత, ఖర్జూర మొక్కలను నాటతామన్నారు. భవిష్యత్తులో గౌడ కులస్తులకు ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.