తెలంగాణ

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు నిథులు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు కేటాయించిన నిధులను వెంటనే విడుడదల చేయాలని బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కోరారు. శాసనసభలో సంక్షేమ పద్దులపై గురువారం జరిగిన చర్చ సందర్భంగా జాఫర్ హుస్సేన్, ప్రభాకర్ వేర్వేరుగా మాట్లాడుతూ, 2017-18 లో 100 కోట్ల రూపాయలు, అంతకు ముందు సంవత్సరం 100 కోట్ల రూపాయలను ప్రభుత్వం బ్రాహ్మణ కార్పోరేషన్‌కు కేటాయించిందని గుర్తు చేశారు. అయితే ఈ నిధులు విడుదల చేయకపోవడం వల్ల పేదరికంతో బాధపడుతున్న బ్రాహ్మణులకు ఆర్థిక చేయూత లభించడం లేదని, ఉపాధి పథకాలు, విద్య, వైద్యం తదితర అవసరాలకు నిధులు లభించకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీకి చెందిన ప్రజలకు కూడా ఆయా ఫైనాన్స్ కార్పోరేషన్ల ద్వారా సాయం అందడం లేదన్నారు. కేయాయింపులు భారీగా చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రకటిస్తున్నప్పటీకి, వాస్తవంగా నిధులు విడుదల చేయడం లేదని వాపోయారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పథకాలు, కార్యక్రమాల పట్ల జాఫర్ హుస్సేన్ హర్షం వ్యక్తం చేశారు. షాదీ ముబారక్ పథకం కింద ఇప్పటి వరకు ఇస్తున్న 75.116 రూపాయలను ఇక నుండి 1,00,116 రూపాయలకు పెంచడం పట్ల ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వైశ్యులకు ఆర్థిక సాయం చేసేందుకు వైశ్యా సంక్షేమ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఎన్‌విఎస్‌ఎస్ ప్రబాకర్ కోరారు.