తెలంగాణ

ప్రజాసేవలో సత్యసాయి సేవా ఆర్గనైజేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: ప్రజలకు సేవ చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామని శ్రీసత్యసాయి సేవా ఆర్గనైజేషన్ (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఓ) తెలంగాణ, ఎపి రాష్ట్రాల కన్వీనర్ హెచ్‌జే దొర (డిజిపి-రిటైర్డ్) తెలిపారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేస్తూ, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తికావస్తుండటంతో ‘గోల్డెన్ జూబ్లీ’ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఈ నెల 25 నుండి 2018 ఏప్రిల్ 4 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పుట్టపర్తి ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంస్థగా పేరుతెచ్చుకున్నదని వివరించారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో 23 చోట్ల తాగునీటి క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని, పేదలకు పాదరక్షల పంపిణీ చేస్తామన్నారు. హైదరాబాద్ రూరల్ ప్రదేశాల్లో రీమోట్ ఒకేషనల్ శిక్షణా కిట్ల పంపిణీ చేస్తామన్నారు. మహిళలకు గాజుల తయారీ, బ్యూటీ ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, మెహిందీ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. పేదలకు ఉచితంగా ఆహార పంపిణీ చేస్తామని, వివిధ ప్రదేశాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బాగ్‌అంబర్‌పేటలో ఉన్న శ్రీసత్యసాయి విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటవుతుందని, ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఓ జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండ్య హాజరవుతారని, ముగింపు ఉత్సవాలు ఏప్రిల్ 4 న శివంలో నిర్వహిస్తామని దొర తెలిపారు. -