తెలంగాణ

‘రైతులక్ష్మి’కాదు.. ‘రైతుబంధు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వ్యవసాయ పెట్టుబడికి ప్రభుత్వం అందించబోయే నాలుగువేల రూపాయల పథకం పేరును ‘రైతుబంధు’గా మార్చారు. ఈ పథ కం పేరును తొలుత రైతులక్ష్మిగా పెట్టాలని భావించారు. అయితే అన్నికోణాల్లో ఆలోచించి పథకం పేరు రైతుబంధు అని ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి నిర్ణయించారని రాష్ట్ర వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, ఒక్కో రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమికి ఈ సాయం లభిస్తుందని వెల్లడించారు. గతంలో పహాణీలో ఉన్న అంశాలే ఇప్పుడు భూరికార్డుల్లోకి ఎక్కాయన్నారు. భూసమగ్ర సర్వే ద్వారా రూపొందించిన భూముల మొత్తం డేటా రెవెన్యూ శాఖవద్ద అందుబాటులో ఉందన్నారు. రైతుబంధు పథకం కోసం రూపొందించిన పోర్టల్‌లో రైతుకు సంబంధించిన సమాచారమంతా ఉంటుందన్నారు. ఈ వివరాలు తహశీల్దార్ సంతకంతో ఎన్‌ఐసి వారు పొందుపరుస్తున్నారన్నారు. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) గుర్తించిన మండల స్థాయి నోడల్ బ్యాంక్ ద్వారా చెక్కుల పంపిణీ జరుగుతుందన్నారు. పంటల సాగు ప్రారంభానికి ముందే చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. చెక్కులపై పథ కం పేరు, లబ్దిదారుడిపేరు, పట్టాపాస్‌పుస్తకం నెంబ ర్, ఇవ్వనున్న నగదుమొత్తం, రెవెన్యూ గ్రామం పేరు ఉంటాయన్నారు. రాష్ట్రంలో స్థిరీకరించి వివరాల ప్రకారం 60 లక్షల పైగా రైతుల ఖాతాలు ఉన్నాయి. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్, ఆర్థిక సంయుక్త కార్యదర్శి సిహెచ్‌వి సాయిప్రసాద్, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి