రాష్ట్రీయం

ఎమ్సెట్‌కు నీట్ భిన్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: మెడికల్, డెంటల్ అడ్మిషన్లకు అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు (నీట్) రాష్టస్థ్రాయిలో నిర్వహిస్తున్న ఎమ్సెట్‌కు కొద్దిగా భిన్నం. ఎమ్సెట్ పరీక్ష 160 మార్కులకు జరుగుతుంది.
ఒక్కో సబ్జెక్టులో 40 ప్రశ్నలు చొప్పున ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సమాధానానికి ఒక మార్కు చొప్పున 160 మార్కులకు ర్యాంకులు ఇస్తారు. సమాధానం రాసేందుకు మూడు గంటల వ్యవధి ఉంటుంది. అదే నీట్‌లో అయితే ఇవే సబ్జెక్టుల నుంచి ఒక్కో సబ్జెక్టులో 45 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. అంటే నీట్ పరీక్ష మొత్తం 720 మార్కులకు జరుగుతుంది. పరీక్ష రాసేందుకు మూడు గంటల వ్యవధి ఇస్తారు. సరైన సమాధానానికి నాలుగు మార్కులు. సమాధానం తప్పు రాస్తే మైనస్ మార్కు పడుతుంది. జాతీయస్థాయిలో 720 మార్కులకు అభ్యర్థులకు ర్యాంకులు ఇస్తారు. అర్హత పరీక్షలో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే నీట్ పరీక్షలోనూ కనీసం ప్రతి సబ్జెక్టు నుండి 90 మార్కులు సాధించాలి. అప్పుడే వారు తుది ర్యాంకుకు అర్హులవుతారు. ఈ రెండు నిబంధనలూ ఎమ్సెట్‌లో లేవు. కనుక ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినా, మరో సబ్జెక్టులో ఎక్కువ వస్తే ఎమ్సెట్‌లో మంచి ర్యాంకు సాధించే వీలుంది. నీట్‌లో ప్రతి సబ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించాలనే నిబంధనను ఇప్పుడు విద్యార్థులు కొత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.