తెలంగాణ

లెక్కల ప్రశ్నపత్రం లీక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో పద వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం గురువారం కలకలం సృష్టించింది. జిల్లాలోని కొడిమ్యాల మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో పదవ తరగతి పరీక్షలు జరుగుతుండగా కొంత మంది ఉపాధ్యాయులు సమీపంలోని ఒకరి ఇంట్లో మూకుమ్మడిగా గుమిగూడి ప్రశ్నాపత్రాలకు సమాధానాలు రాస్తుండగా స్థానిక ఎస్సై సతీష్ వారిపై దాడి చేసి పట్టుకున్న సంఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గురువారం పదవ తరగతి మ్యాథ్స్ - 2పరీక్ష జరుగుతుండగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణగౌడ్, వడ్లకొండ రమేష్, శ్రీనివాస్, మంద లింగవ్వ, రాధ, పద్మలతో మరో నలుగురు ఉపాధ్యాయులు సమీపంలోని ప్రైవేట్ గృహంలో సమావేశమై ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసి సమాధానాలు విద్యార్థులకు అందిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంపై స్థానిక ఎస్సై సతీష్ వారిపై దాడి చేశారు. దీంతో పలువురు ఉపాధ్యాయులు పారిపోగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్సైపై దాడి చేసి పారిపోతుండగా అతనితోపాటు మరి కొందరిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి కొన్ని పత్రాలను స్వాధీన పర్చుకున్నట్టు స్థానికులు చెబుతుండగా పోలీసులు కొందరిని మాత్రం అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాల్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తున్న ఆరుగురు ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతోపాటు నలుగురిపై కొడిమ్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించగా ఉన్నతాధికారులు లీకేజీ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికే ప్రయత్నాలు చేశారు. దీంతో కొంత సేపటికి ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని స్థానిక మల్యాల సీఐ నాగేందర్, డిఇఓ వెంకటేశ్వర్లు ప్రకటించడం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

చిత్రం..ప్రిన్సిపాల్‌ను పట్టుకుంటున్న ఎస్సై సతీష్