తెలంగాణ

2970 గృహ హింస కేసుల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్రంలో హింసకు గురైన మహిళలకు సహాయం అందించేందుకు సఖి (వన్‌స్టాప్) పేరు మీద 9 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ వివరాలను మహిళా శిశు సంక్షేమ శాఖ పద్దులో పేర్కొన్నారు. జిల్లాల్లో గృహ హింస చట్టం విభాగాలకు బాధితుల నుంచి 19010 పిటిషన్లు అందాయి. ఇందులో 12,568 గృహ సంబంధిత నివేదికలు ఉన్నాయి. 911 కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. 2613 కేసుల్లో తుది ఉత్తర్వులను జారీ చేశారు. కౌనె్సలింగ్ ద్వారా 2970 కేసులను పరిష్కరించారు. షీ ట్యాక్సీ కింద మొత్తం 18 మంది మహిళా డ్రైవర్లను ఎంపిక చేసి వాహనాలను సమకూర్చారు. రాష్ట్రంలో 382 బాల్య వివాహాలను నిలిపివేశారు. శిశులింగ దుర్వినియోగ కేసులను గుర్తించి చర్యలు తీసుకున్నారు. పాక్సో చట్టం కింద దాదాపు 993 కేసులు నమోదు చేసినట్లు మహిళా శిశుసంక్షేమ శాఖ పేర్కొంది. ఆపరేషన్ ముస్కాన్-3, ఆపరేషన్ స్మైల్ కింద 2357 మంది పిల్లలను రక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో 59 మంది పిల్లలను దత్తతకు ఇచ్చారు. మరో 57 మంది పిల్లలను విదేశీయులకు దత్తతకు ఇచ్చారు. లైంగిక వేధింపులు, అక్రమ రవాణా, వరకట్న రవాణాలు వంటి వాటి ద్వారా బాధితులైన 441 మంది మహిళలు, బాలికలు, సిఆర్‌పిసి, ఫాక్సో చట్టం కింద ఆర్థిక సహాయం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులు, భిక్షాటన పిల్లలు, అనాథలు, పాక్షిక అనాథలు, కుటుంబ రక్షణ లేని వారిని గుర్తించి వారి సంక్షేమం నిమిత్తం పిల్లల స్నేహపూర్వక గ్రామమాలుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. ఇంతవరకు 83 గ్రామాలను గుర్తించారు.