తెలంగాణ

గుడుంబా అమ్మకందార్లకు పునరావాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: రాష్ట్రంలో గుడుంబా తయారీని పూర్తిగా నిలిపివేశామని, అమ్మకం దార్లకు పునరావాసాన్ని కల్పిస్తూ అనేక సం క్షేమ చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు చె ప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, రాష్ట్రంలో 6180 మంది గుడుంబా అమ్మకం దార్లకు పునరావా స సదుపాయం కల్పించామన్నారు. రూ.2 లక్షల సబ్సిడీ కింద నిధు లు ఇస్తున్నట్లు చెప్పరు. ఇందులో 2342 మంది ఎస్టీలు, 1059 మంది ఎస్సీలు, 2683 మంది బీసీలు, ఇతరవర్గాలు 96 మందికి సబ్సిడీ కింద నిధులు పునరావాసం నిమిత్తం ఇచ్చామన్నారు. గుడుంబా కేసుల కిం ద బైండోవర్ అయిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందన్నా రు. రాష్ట్రంలో ఇంతవరకు 169.44 ఖర్జూరం చెట్లను నాటామన్నారు. వచ్చే ఏడాది రెండు కోట్ల ఖర్జూరం చెట్లను నాటనున్నట్లుచెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ జోక్యం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబా అమ్మకాన్ని నిరోధించేందదుకు ఈ వృత్తికి అలవాటు పడిన వారిని గు ర్తించి పునరావాస సదుపాయం కల్పించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆదేశించారు. రాష్ట్రంలో పదివేల గ్రామాలున్నాయని, ప్రతి గ్రామంలో కనీసం 60 మందిని గుడుంబా అమ్మకం దార్లను గుర్తించివారు ఆ వృత్తిని మాని జనజీవన స్రవంతిలో వచ్చే విధంగా పునరావాస సదుపాయం కల్పించాలని స్పీకర్ కోరారు.
తుదిదశలో ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు
నల్లగొండ జిల్లాలో ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభకు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎమ్మెల్యేలు వేముల వీరేశం, నల్లమోతు భాస్కర్‌రావు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి సరఫరా చేస్తామన్నారు.