తెలంగాణ

గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా గ్రూప్-1 నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య శుక్రవారం శాసనసభలో జీరో అవర్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ లో జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ, గ్రూప్-1 పోస్టులు ప్రధానమైనవని, పరిపాలనలో కీలకమైన పాత్రను ఈ అధికారులు పోషిస్తారని చెప్పారు. ఈ పోస్టుల నోటిఫికేషన్ రాష్ట్ర వ్యా ప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. మేడ్చెల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మేడ్చెల్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అశ్వాపురం మండల గ్రామాలకు కూడా సరఫరా చేయాలని కోరారు. మజ్లిస్ ఎమ్మెల్యే జాఫ ర్ హుస్సేన్ మాట్లాడుతూ పాతబస్తీలో కొంత మంది రౌడీజానికి పాల్పడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కనక య్య మాట్లాడుతూ ఇల్లెందు నియోజకవర్గంలో 120 గ్రామాలు ఉన్నాయని, బస్సు సదుపాయం కల్పించాలని, రోడ్లను నిర్మించాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ నగరం లో స్థిరపడిన మార్వాడీ, రాజపుత్ సమాజం తదితర వర్గీయుల్లో బీసీలకు సర్ట్ఫికేట్లు ఇప్పించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ, నిజామాబాద్ పట్టణంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని లేదా డబుల్ బెడ్‌రూం ఇండ్లలో కోటా కేటాయించాలని కోరారు.