తెలంగాణ

దేవాదాయ శాఖ భూములు కబ్జా కానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: రాష్ట్రంలో దేవాదాయ భూములు అన్యాక్రాంతం కా కుండా కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన భూ సర్వే ప్రాజెక్టు వల్ల దేవాదాయ శాఖకు 74155 ఎకరాల భూమి ఉన్నట్లు వెల్లడైందన్నారు. ఈ భూములు కబ్జా కాకుండా పటిష్టమైన ప్రణాళికను ఖరారు చేయనున్నట్లు చెప్పరు. ధూప దీప నైవేద్య పథకా న్ని త్వరలో మూడు వేల దేవాలయాలకు వర్తింప చేయనున్నట్లు చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆమో దం తెలియచేశారన్నారు. శుక్రవారం అ సెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఒ. సతీష్ కుమార్ తదితరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, గతంలో ధూ పదీప నైవేద్య పథకం కింద 1805 దేవాలయాలకు నెలకు రూ.2500 ఇచ్చేవారన్నా రు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నెలకు రూ.6వేలకు పెంచామన్నారు. 3వేల దేవాలయాలకు సంబంధించి ఈ స్కీంను వర్తింప చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం తెలిసిన వెంటనే 5289 దేవాలయాల నుంచి దరఖాస్తులు వచ్చాయన్నా రు. వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఈ దరఖాస్తులను పరిశీలించి త్వరలో సిఫార్సులు చేస్తారన్నారు. ప్రస్తుతం ధూపదీప నైవేద్య పథకం కింద నెలకు రూ.1.08 కోట్లు ఖర్చవుతున్నాయని, కొత్తగా దేవాలయాల సంఖ్యను పెంచడం వల్ల నెలకు వ్యయం రూ. 2.88 కోట్లకు పెరుగుతుందన్నారు. సాలీనా బడ్జెట్ రూ.34.56 కోట్లు అవుతుందన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ చట్టం కింద 12302 దేవాలయాలు నమోదు అయ్యాయన్నారు. వీటిలో 646 ఆలయాలకు ఆదాయ వనరులు ఉన్నాయని, మిగిలిన 8151 ఆలయాలకు ఎటువంటి ఆదాయ వనరులు లేవనన్నారు. రాష్ట్రంలో గిరిజనుల ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయాలకు కూడా ధూపదీపనైవేద్య స్కీంను వర్తింప చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.