తెలంగాణ

జియో ట్యాగింగ్‌తో మొక్కల సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించుకునేందుకు జియో ట్యాపింగ్ విధానాన్ని వినియోగించుకుంటున్నట్టు మంత్రి జోగు రామన్న తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఉద్యమంలా వనాలు నాటాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో భాగంగా కోట్లాది మొక్కలను నాటినట్టు చెప్పారు. కేవలం మొక్కలను నాటి వదిలేయకుండా వాటిని పూర్తిస్థాయిలో సంరక్షించుకునేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు. అడవుల్లో వివిధ రకాల పండ్ల మొక్కలను నాటడం ద్వారా కోతులు జనావాలకు రాకుండా చూస్తున్నామని, రెండు కోట్లతో కోతుల రిహాబ్లిటేసన్ సెంటర్‌ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా 4200 నర్సీలను ఏర్పాటు చేశామని వివరించారు.