తెలంగాణ

రాష్ట్రంలో నగర జనాభా 42శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో నగర ప్రాంతాల్లో 42 శాతం, జాతీయ స్థాయిలో నగర జనాభా 30శాతం ఉందని, రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి, సమీప గ్రామీల విలీనానికి చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తామ ని ఆయన చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు బ దులిస్తూ మున్సిపాలిటీలకు సమీపంలోని గ్రామాలను మున్సిపల్ పట్టణాల్లో విలీనం చేస్తామన్నారు. ప్రతి మున్సిపాలిటీల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. జనాభా పెరగడంతో భారం కూడా పెరుగుతుందని, దీనికి తగ్గట్టుగా పన్నులు కూడా పెంచక తప్పదని ఆయన చె ప్పారు. కొత్త మున్సిపాలిటీలను ఇంకా ఖరారు చేయలేదన్నారు. రాష్టమ్రంతా అన్‌లైన్‌లో భవనాల అనుమతిని జారీ చేసేందుకు డీపీఎంఎస్ వ్యవస్థను ప్రవేశపెట్టామన్నారు. ఆన్‌లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ముందు లైసెన్సు టెక్నికల్ సిబ్బందికి పునశ్చరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకు ఆన్‌లైన్ కింద 49,963 భవనాలకు అనుమతులిచ్చామని చెప్పారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 947 అనుమతులు, అ ర్బన్ లోకల్ బాడీస్ కింద 28770 అనుమతులు ఇచ్చాయన్నారు. జా ప్యానికి బాధ్యులైన సిబ్బందిపై జాప్యం జరిగిన ప్రతిరోజుకు రూ.1000 జరిమానా విధించాలని, ఈ ఏడాది జనవరి 19న జీవో జారీ చేశామన్నారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరింలా ప్రోసెసింగ్ కాలపరిమితిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.