తెలంగాణ

గిరిజన సంక్షేమంపై ప్రతినెలా సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16 : గిరిజన సంక్షేమంపై ఇక నుండి ప్రతినెలా సమీక్ష చేస్తానని రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. గిరిజన సంక్షేమ కార్యక్రమాలపై సోమవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. గిరిజనుల సంక్షేమం కోసం ఉపప్రణాళికా నిధులు అవసరానికి అనుగుణంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి ప్రతినెలా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని సమీక్షించడం వల్ల సత్ఫలితాలు వస్తాయని వివరించారు. సబ్-ప్లాన్ నిధులను పూర్తిగా సద్వినియోగం చేసేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మణ్, గిరిజన సంక్షేమ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ లక్ష్మణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.