తెలంగాణ

జైళ్ల సంస్కరణలో రాజీలేదు పెరోల్ నిబంధనలను సరళీకరిస్తాం : నాయిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 16: జైళ్ల సంస్కరణలో రాజీపడేది లేదని, ఖైదీల ఆరోగ్యం కోసం సన్నబియ్యంతో ఆహారమందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. వరంగల్‌లో సోమవారం ఖైదీల రాష్ట్ర స్థాయి రెండవ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవానికి వచ్చిన నాయని విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఖైదీలకు పెరోల్, బెయిల్‌ను నిబంధనలను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేట్ స్థాయి కంపెనీలలో ఉద్యోగం చేసే విధంగా ఖైదీలను తీర్చిదిద్దే బాధ్యత జైలు అధికారులదేనన్నారు. ఖైదీలలో మార్పు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలన్నారు. జైళ్లలో చేపట్టే సంస్కరణల వల్ల ఖైదీల మరణాలు తగ్గాయన్నారు. ఖైదీలకు మైండ్ డైవర్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తద్వారా వారిలో ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత నెలకొంటుందన్నారు. జైళ్లలో ఖైదీలు చేసే ఉత్పత్తులకు రూ. 60 వేల ఆర్డర్‌లు వచ్చాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపి పసునూరి దయాకర్, మేయర్ నన్నపనేని నరేందర్, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.