తెలంగాణ

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 17: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ కేంద్ర అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి సిఆర్‌పిఎఫ్ బేస్‌క్యాంపుపై మావోయిస్టులు తెగబడిన ఘటనలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సిఆర్‌పిఎఫ్ జవాను మృతిచెందాడు. సుమారు 20మంది నక్సలైట్లు బేస్ క్యాంపును టార్గెట్ చేసి కాల్పులకు తెగబడటంతో, సెంట్రీ విధుల్లోవున్న బోథ్ మండలం మర్లపెల్లికి చెందిన గొడిసెల సతీష్ గౌడ్ (23) మృతిచెందాడు. బుల్లెట్ దెబ్బతిన్న సతీష్‌గౌడ్ సహచర సిఆర్‌పిఎఫ్ జవానులను అప్రమత్తం చేసి నక్సలైట్లతో వీరోచితంగా పోరాడి అసువులు బాశాడు. 2013 బ్యాచ్‌కు చెందిన గొడిసెల సతీష్‌కుమార్ సిఆర్‌పిఎఫ్‌లో చురుకైన పాత్ర పోషించి నక్సల్స్ ఏరివేతలో సమర్ధవంతంగా పని చేశాడని సిఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు బీజాపూర్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సతీష్‌కుమార్ భౌతికకాయాన్ని ఆదిలాబాద్‌కు తీసుకొచ్చారు. ఇక్కడా జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ పనసారెడ్డి, డిఎస్పీ లక్ష్మీనారాయణ, సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పరిష్కిత్ యాదవ్ సతీష్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం జవాను భౌతికకాయాన్ని సొంత గ్రామమైన మర్లపెల్లికి తీసుకెళ్లి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సతీష్ కుటుంబానికి సిఆర్‌పిఎఫ్ అధికారులు రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. సహచర జవానులను రక్షించుకునేందుకు ప్రాణాలొడ్డి పోరాడిన సతీష్ ధైర్య సాహసాలను కీర్తిస్తూ, ఆయన మృతిపట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

చిత్రం... హెలికాఫ్టర్‌లో భౌతికకాయాన్ని తీసుకువస్తున్న సిఆర్‌పిఎఫ్ సిబ్బంది.
ఇన్‌సెట్‌లో వీరజవాను సతీష్ గౌడ్