తెలంగాణ

నాసా సదస్సుకు ఎంపికైన విద్యార్థులకు సీఎం కేసీఆర్ అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో మే 24 నుంచి 27 వరకు అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా) ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు ఎంపికైన తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయానికి చెందిన విద్యార్థులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించారు. మైనార్టీ గురుకుల విద్యాలయానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఫ్యూజన్ ఎల్-5 ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ఈ ప్రాజెక్టు ఆధారంగా అంతర్జాతీయ స్పేస్ కాన్ఫరెన్స్‌కు ఈ ఆరుగురు విద్యార్థులను నాసా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి షఫియుల్లా సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఎంపిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాయ గుర్తింపులను తీసుకువస్తారన్న ఆశాభావాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు.